కరోనాను  ఖచ్చితంగా జయిస్తాం (కవిత ) రచన: ప్రపంచ రికార్డుల గ్రహీత ,    ‘కవిరత్న’ డాక్టర్ చింతల శ్రీనివాస్   గ్లోబల్ చైర్మన్ , లిటరరీ ఫోరమ్  WAM 


’స్వీయ నిర్బంధం’...శాపం కాదది ‘వరం’ స్వీయ చరిత్ర సృష్టించే ... అద్భుత అనుభవ కేంద్రం సామూహిక దిగ్భంధం...అవమాన చీకటి కాదది  ఆరోగ్య ప్రధాతగా, అసమాన వెలుగు ప్రపంచం అంతర్గతశక్తి  బహిర్గతమై ...దుష్ట కోవిడ్-19 ను దునుమాడే ...సాంఘిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రభుత్వ ఆదేశాల  ... ప్రజలందరి ఆరోగ్య , ప్రాణ రక్షణకై పకడ్బందీగా పాటిద్దాం ...ఈ శతాబ్ద నటోరియస్ ‘కరోనా వైరస్ ‘ను వాషౌట్ చేద్దాం ఈ మహమ్మారిని సర్వశక్తులా , సర్వనాశనం చేద్దాం భూతలం నుండి తరిమేద్దాం ...అక్షయ ఆరోగ్యం సాధిద్దాం , ప్రపంచ ఆర్థిక మాంద్యం వడిగా పరుగిడుతుంటే ... భూగోళ జనావళికి వేదన కలిగించే అహంకార కరోనా ... కొవ్వును కరిగించాలి జన్యు రేణువు వైరస్ ను ... తుత్తునియలు చేయాలి వ్యక్తిగత, కుటుంబ, సమాజ , దేశ , ప్రపంచ కరోనా రహిత మహిత ఆరోగ్య మహాభాగ్య భూమండలం వర్ధిల్లాలి  ప్రపంచాన పరిపరి విధాలా , త్వరితగతిన సాగే “కరోనా వాక్సిన్ “ పరిశోధనలు కోవిడ్ -19 అంత ఔషధం కనుగొనాలి ....మన అఖండ భారత్ సారధిగా సాధించాలి వైద్య విలువల , ఆచారాల ఆచార్యులం విజ్ఞానశాస్త్ర , సాంప్రదాయవిలువల సంపన్నులం కోవిడ్-19 ను ...సమాప్తి చేద్దాం ...విశ్వమానవ ఆరోగ్య కాంతిని ...అంతటా ప్రసరింపచేద్దాం 


కామెంట్‌లు