తేదీ 14.4.2020 రోజున ఆర్.టి.సి ఎక్స్ రోడ్స్ లో అవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉపాహారము మరియు కరోన మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమము మే నెలలో 3వ తేదీ వరకు కొనసాగునని తెలియబరచినారు. ఈ కార్యక్రమమును ముషీరాబాద్ శాసన సభ్యుడు ముటా గోపాల్ గారు ప్రారంభించగా అధ్యక్షుడు ఆర్. నమఃశ్శివాయ, ఆర్థిక కార్యదర్శి మాకం భద్రినాథ్, సలహాదారు డా.మారం లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి బచ్ఛు శ్రీనివాస్, సంపత్ మరియు కార్య నిర్వహక కమిటీ సభ్యుడు కె.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా హైదరాబాద్ సలహాదారు డా.మారం లక్ష్మయ్య గారికి మరియు వీడియో చిత్రీకరించిన V3 ఛానల్ వారికి, వీడియో చిత్రీకరణ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారికి మరియు ప్రోత్సాహమిచ్చి సహకరించిన అందరికి అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు.
అవోపా హైదరాబాద్ అల్పాహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి