చీకటి దుప్పటి ... వెలుగు ప్రవాహమై ...
నేను ...రాజ్యమేలుతానంది..చీకటి రాకాసి ...
కనిపించదు ...కాటేస్తుంది ...వినిపించదు ,గుండెల తీసేస్తూ...
ఆకలితోవున్నాను ... భూగోళజనావళిని భోంచేస్తానంటోంది ...
ప్రకృతిమాతనెప్పుడైనా...కరుణతో పలకరించారా
అని కోపంగా ప్రశ్నించింది ...పకపకా నవ్వేసింది ...
మానవ గుంపుల్లోచేరి ...గుట్టుగా , ఊపిరుల దూరంచేస్తానంటుంది ...‘మహమ్మారి ' రాకాసి
చతికిలబడతారనుకుందేమో ...అలా...అలా
అలుపెరుగని ముసురై , అసురత్వంతో కమ్మేస్తుంది
ఊపిరిసలుపనీయక ... మానవమృత్యుగానం
ఆలాపిస్తుంది ...నేను కరోనా ...కోవిద్-19 అని సవాల్ విసురుతోంది ...
ఇప్పుడు నాకర్థమైంది ...!!!మెదడు మూలలో , గుండేఅంచులో , ఏవేవో ...తరంగాలు తలలెత్తాయి
'ప్రకృతి ' పాకశాల అని నేను ఎప్పుడో మరిచానని
తింటున్నది ...ఎందుకో , ఎవరికో , ఏమిటో తెలియదని ...’పరిశుభ్రతా పుస్తకం ' ఎప్పుడో మరిచానని ...
అన్నిటిలో ఆధిపత్యం కావాలి ..
చోటెపుడూ పొందలేదని ...
ఇపుడిపుడే జ్ఞానోదయ వీచికలు ... మానసవీణా తంత్రుల్ని ... తికమకగా ...మీటుతున్నాయి
సరిహద్దులెప్పుడూ ...తేలిపోయే మేఘాలని ...
కుల, మత , భాషా , దేశ బేధాలు ...రాకాసికి లేవని
కదనంలో కట్టడిచేసి , రాకాసిని తుదముట్టడించడానికి ... నడుంబిగించాను ...
'స్వీయ నిర్బంధం ' ... మూగ శాపం కాదు, సుస్వరాల వరమని ...
'సాంఘిక దూరం ' తో ... రక్కసి నాశనం తప్పదని ...
'నిర్బంధం' ...రాకాసిని రూపుమాపే ఔషధమని
తరంగాల్లో తలమునకలౌతూ ...
వ్యక్తి క్షేమమే ...కుటుంబ సంరక్షణ అని తేల్చుకున్నాను ... తరతరాల తరగని సంపదఅని
పదే , పదే స్తుతిగా ధ్యానిస్తున్నాను ....
అక్షరాలా రాకాసిని సంహరిస్తాను ...
చీకటి దుప్పటిని చించి పారేసి ...ఆరోగ్య వెలుగు ప్రవాహమై సాగుతాను ...
This is header
• Avopa News Bulletin
This is footer
*Cheekati Duppati ... Velugu Pravaahamai ... ( POEM) Written by : World Records Holder , “Kaviratna” Dr. Chintala Srinivas , WAM ,Global Chairman Literary Forum
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి