తేదీ 23.4.2020 రోజున జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అవోపా మరియు వాసవి క్లబ్ వారు సంయుక్తంగా సూపరింటెండెంట్ డాక్టర్. అనిత రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు అతిథిగా హాజరై ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని మనం చేసే రక్తదానం వలన మరి ఒకరి ప్రాణాలు నిలబెట్టగలమని అన్నారు. ఈ శిబిరంలో సుమారు 75 మంది రక్త దానం చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ తలసేమియా మరియు ఇతర వ్యాధి గ్రస్తులకు రక్తం అవసరం ఉన్నందున ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా జమ్మికుంట అధ్యక్షుడు అయిత సుధాకర్, రావికంటి మధు, గందె ప్రవీణ్, ఆకినపెళ్లి శ్రీనివాస్, సుద్దాల శ్రీనివాస్, యాద శేఖర్, భూపతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి