తేదీ 23.4.2020 రోజున అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో 7వ రోజు అల‌్పాహర పంపిణీ కార్యక్రమం 250 మంది పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు, పాత్రికేయులకు, వలస కూలీలకు శ్రీ దేవా మధుబాబు - మానస (రమాదేవి) దంపతులు స్పాన్సర్ చేయగా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కార‌్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, అవోపా హనుమకొండ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ పోకల చందర్, యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, కే. రమేశ్, రామానుజం, దేవా మహేందర్, రఘువీర ప్రసాద్, డాక్టర్ తాటిపెళ‌్ళి గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార‌్యక్రమమును స్పాన్సర్ చేసిన దంపతులకు "వాసవీ" మాత కరుణా కటాక్షాలతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అవోపా, హన‌్మకొండ అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్ వారి కమిటీ కోరుకును చున్నారు.
అవోపా హనుమకొండ వారి అల్పాహారం పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి