హుజుర్ నగర్ లో అవోపా, వైశ్యసంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీసూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, పట్టణ వర్తక సంఘం, అవోపా హుజూర్నగర్ ఆధ్వర్యంలో వందమంది  నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1500  రూపాయల విలువచేసే 25 కేజీల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ స్థానిక వాసవి సత్రం నందు నిర్వహించబడింది. మున్సిపల్ చైర్మన్  గెల్లి అర్చన రవి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం లో కూడా చాలా మంది నిరుపేదలు ఉండటం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఆర్యవైశ్య సంఘం పెద్దలు  అందరు కలిసి 1,50,000 రూపాయలు చందా రూపంలో వసూలు చేసి  వందమంది నిరుపేద  ఆర్యవైశ్యులను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దాస నాగేశ్వరావు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి , పట్టణం ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి, దాస నాగేశ్వరరావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి నరసింహారావు , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు  గజ్జి ప్రభాకర్ , గెల్లి అప్పారావు, కుక్కడపు రామ్మోహన్ రావు,  బచ్చు రామారావు, ఓరుగంటి మట్టయ్య ,  మున్సిపల్ కౌన్సిలర్స్  ఓరుగంటి నాగేశ్వరరావు, వీర్ల పాటి గాయత్రి భాస్కర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఈసీ మెంబర్ మా శెట్టి అనంత రాములు, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు  జూలకంటి వాణి,  శ్రీమతి గుండా సుశీల, అవోపా కోశాధికారి రామారావు, కామిశెట్టి నందయ్య తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు