టౌన్ అవోపా పాలమూరు వారు నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంత్యుత్సవాలు


టౌన్ అవోపా పాలమూరు వారి అద్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా టౌన్ అవోపా అధ్యక్షుడు బి టి ప్రకాష్ అధ్యక్షతన స్థానిక కలెక్టర్ బంగ్లా చౌరస్త లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి  ఆర్యవైశ్యులు అందరూ  కలిసి  పూలమాలలు వేసి పొట్టి శ్రీరాములు సేవలను కొనియాడి  ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో అవోపా సెక్రెటరీ, చంద్రశేఖర్, ట్రెజరర్ జ్వాల నరసింహ, అవోపా రాష్ట్ర నాయకులు, కలకొండ సూర్యనారాయణ, కొండూరి రాజయ్య, జిల్లా అవోపా అధ్యక్షుడు కంది శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కలకొండ బాలకిష్టయ్య, మహిళ సంఘం అధ్యక్షురాలు సంబు బాలమణి, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు ఆకుతోట రాఘవేంద్ర, పట్టణ  అవోపా సభ్యులు వాసవి క్లబ్ వారు, అన్నిసంఘాల నాయకులు, ఆర్య వైశ్యులు తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు