ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు కరోన వైరస్ ప్రభావంతో ఏప్రిల్ 14 వరకు యావత్ భారత దేశానికి లాక్డ్ డౌన్ ప్రకటించారు. ఈ మహమ్మారి చాలా ఉధృతంగా విజృంభించు చున్నందున మనము తీసుకోవలసిన జాగ్రత్తలు విధిగా పాటించాలి. సామాజిక దూరం పాటించండి. ఇంట్లో నుండి వీధిలోకి రాకండి. ఎక్కువ మందికి కరోన సోకితే అందరికి సరిపడా ఆసుపత్రులు లేవు, మందులు ఉండవు, బెడ్స్ ఉండవు, కాబట్టి కరోన మనకు సోక కుండా మనింట్లోకి రాకుండా అడ్డుకోవడమే, ప్రభుత్వ ఆదేశాలు పాటించడమే మనముందున్న మార్గం. అనాలోచితంగా నిర్లక్ష్యం చేసి కరోనాను ఆహ్వానించకండి. కుటుంబ సభ్యులందరు కలిసి దానిని అడ్డుకోవలసినదిగా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వినమ్రంగా చేతులు జోడించి వేడుకొనుచున్నవి.
నూకా యాదగిరి, ఎడిటర్, అవోపా న్యూస్ బులెటిన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి