నూతన దంపతులకు శుభాకాంక్షలు


శ్రీమతి కటకం లక్ష్మీ వెంకట్ శెట్టిల కూతురు సుప్రజహర్ష  వివాహము వినయ్ కుమార్ తో తేదీ 28.2.2020 రోజున ఆర్.జి గార్డెన్స్ లో జరుగుచున్న సందర్భంలో శ్రీ వెంకటశెట్టి గారు సంతోషపడుతూ తన కూతురు వివాహము తెలంగాణ రాష్ట్ర అవోపా మాట్రిమోనిలో ప్రకటించడం వలనే జరిగినదని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అవోపా మరిన్ని వివాహ ప్రకటనలు ఇవ్వాలని, అందులకు కంప్యూటర్ కొనుగోలు చేయాలని ఆకాంక్షిస్తూ, తనవంతు వాటాగా  రు.6000 లు చెల్లించినారు. అట్టి డబ్బును వసూలు చేసిన శ్రీ ఎం.ఎన్. రాజకుమార్ వనపర్తి జిల్లా అవోపా అధ్యక్షుడు మరియు అవోపా న్యూస్ బులెటిన్ చందా దారుల కమిటీ చైర్మన్ గారికి చెల్లించిన శ్రీ కటకం వెంకటశెట్టి గారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతన వధువరులకు శుభాకాంక్షలు  తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు