శ్రీ వాస శేషగిరిరావు ఐ.ఆర్.ఎస్ గారి పదోన్నతికి అభినందనలు

శ్రీ వాసా శేషగిరిరావు, ఐ.ఆర్.ఎస్, చీఫ్ కమీషనర్ జి.ఎస్.టి అండ్ కస్టమ్స్, జి.ఎస్.టి భవన్ బశిర్బాగ్, హైదరాబాద్ గారికి జి.ఎస్.టి ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ గా పదోన్నతి రాగా తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున ఐ.టి వింగ్ చైర్మన్ శ్రీ పి.ఎస్.ఆర్ మూర్తి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖలో అతి ఉన్నత పదవైన డి.ఐ.జి ఇంటెలిజెన్స్ ను అతి సమర్థవంతంగా నిర్వహించుచున్న శ్రీ శివకుమార్, ఐ.పి.ఎస్ గారలు సంయుక్తంగా వారిని వారి కార్యాలయంలో కలసి అభినందనలు తెలిపారు. శ్రీ రావు గారు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను తేదీ 20.2.2020 రోజున చెన్నైలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నానని తెలిపారు. పదోన్నతిపై చెన్నైలో పదవీ బాధ్యతలు చేబట్టబోవుచున్న వారికి వాసవీ మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు మరిన్ని పదోన్నతులు పొందాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి గారలు అభినందనలు తెలుపుచున్నారు.
కామెంట్‌లు