వనపర్తి నూకల శరణ్ కుమార్ భవానిల వివాహ సందర్భంగా  అభినందనలు


అవోపా వనపర్తి పూర్వాధ్యక్షుడు నూకల భాస్కర్ ఏకైక కుమారుడు శరణ్ కుమార్ వివాహము శ్రీ కండే శ్రీదేవీ రాము గారల ఏకైక పుత్రిక భవాని గారితో తేదీ 26.2.2020 రోజున  కల్యాణ సాయి ఫంక్షన్ హాల్ వనపర్తి లో జరుగగా   పలువురు వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను దీవించారు. రిసెప్షన్ తేదీ 27.2.2020 రోజున ఇందు గార్డెన్డ్ వనపర్తి లో నిర్వహించుచున్న సందర్భంలో  భాస్కర్ గారు అమితానంద భరితులై  వారి కుమారుని వివాహము అవోపా వనపర్తి జిల్లా అధ్యక్షుడు మరియు అవోపా న్యూస్ బులెటిన్ చందా దారుల కమిటి చైర్మన్ శ్రీ ఎం.ఎన్ రాజకుమార్ గారి ప్రోత్సాహంతో అవోపా న్యూస్ బులెటీన్లో ప్రచురించుచున్న సందర్బంలో జరిగినదని పలువురికి తెలియజేస్తూ అవోపా ఇలాంటి ఎన్నో పెళ్లిళ్లు కుదుర్చాలని అందులకు అవోపా కు ఒక కంప్యూటర్ అవసరమున్నదని గుర్తించి కంప్యూటర్ కొనుగోలు చేయుటకు తన వంతు చందాగా రు.6000 లు డోనేట్ చేయుచున్నానని రిసెప్షన్ లో డిక్లర్ చేసి డబ్బులు చెల్లించారు. కావున అట్టి డబ్బులు వసూలు చేసిన ఎం.ఎన్.రాజకుమార్ గారికి చెల్లించిన భాస్కర్ గారికి  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్  కృతజ్ఞతలు తెలుపుతూ నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.


 


కామెంట్‌లు