శ్రీ వేముల శ్రీనివాసులు గుప్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ జాయింట్ ఐ.జి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్ గా పనిచేయుచున్న శ్రీ వేముల శ్రీనివాసులు గారిని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్సిల్ కార్పొరేషన్ జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇదివరలో తెలంగాణ రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖకు 2019-20 సంవత్సరానికి "అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్, భారత ప్రభుత్వం" వారిచే "అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధంగా అమలుపరచినందుకు (Excellence in Adopting Emerging Technologies) గాను *ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డ్ ఫర్ ఈగవర్నెన్స్ 2020 గోల్డ్ మెడల్ అవార్డును ఇవ్వడం జరిగింది* ఈ అవార్డు రావడం వీరి నిజాయితీకి, కఠోర శ్రమకు, అకుంఠిత దీక్షకు నిదర్శనం. వీరు ఇంతటి ప్రతిష్టాత్మక బంగారు పథకం పొందడం యావత్ ఆర్యవైశ్య జాతికే గర్వకారణం. ఇందులకు వీరిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు వారి కమిటీ, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, ముఖ్య సలహాదారు పోకల చందర్, గుండా చంద్రమౌళి మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి, చీఫ్ ఎడిటర్ చిదంబరం గారలు  అభినందనలు  తెలియజేస్తూ వీరు భవిష్యత్తులో ఎన్నో అవార్డులు పొందాలని, మరెన్నో ఘన కార్యాలు  సాధించి జాతికే వన్నె తేవాలని మనసారా కోరుకుంటున్నారు.


 


కామెంట్‌లు