2020 యూనియన్ కేంద్ర బడ్జెట్ పై అవగాహనా సదస్సు నిర్వహించిన వైస్ప్రొ వారు


అఖిల భారత వైశ్య ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (Vyspro - India) వారు తేదీ 8.2.2020 రోజున హైదరాబాద్ పంజాగుట్టలో గల వారి టోపాజ్ భవన సమావేశ మందిరంలో 2020 సంవత్సరపు యూనియన్ బడ్జెట్ పై ఒక అవగాహనా సదస్సును సభ్యులు, విద్యార్థుల కొరకు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో డైరెక్ట్, పర్సనల్ అండ్ కార్పొరేట్ టాక్స్ మ్యాటర్స్, అసెస్మెంట్ అండ్ ఆమ్నెస్టీ పథకాల గురించి కొత్త బడ్జెట్లో అర్థంకాని ఎన్నో విశయాల గురించి లీడింగ్  ప్రాక్టీషనర్ CA శ్రీ క్తిష్ణ సుధీర్ గారు, ఇండస్ట్రియల్ టాక్షేషన్ జనరల్ మానేజర్ CA లక్ష్మీపవన్ గారు, ప్రముఖ టాక్స్ ఎక్సపర్ట్ CA సి.ఎచ్. హరనాథ్ రావు గారు విపులంగా విడమరిచి అందరికి అర్థమగు రీతిలో బహు చక్కగా వివరించి సభికుల అనుమానాల నివృత్తికై సంధించిన ప్రశ్నలకు తగు రీతిన సమాధానాలు చెప్పి సభికులచే ప్రశంసింప బడ్డారు. ఈ అవగాహనా సదస్సులో తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున సంస్థ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజినీర్ శ్రీ నిజాం వెంకటేశం గారు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైస్ప్రొ అధ్యక్షుడు శ్రీ మధు మోహన్ గారు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి ఇంజినీర్ ఆర్.శ్రీనివాస్ మరియు కోశాధికారి CA గురురాజ్ గారల పర్యవేక్షణలో ప్రోగ్రాం కోఆర్డినేటర్స్  సంకా నారాయణమూర్తి మరియు రేపాక లక్ష్మణ్ జీ గారు ప్రోగ్రాం విజయవంతమగుటలో ప్రధాన పాత్ర పోషించారు. కామెంట్‌లు