కరోన వైరస్ ముందస్తు నియంత్రణ హోమియో మందు మరియు జ్యూట్ బ్యాగుల పంపిణీ


తేదీ 1.2.2020 రోజున జరిగిన కార్యవర్గ సమావేశములో తీర్మానించిన విధముగా రాజేశ్వర రావు గారు కరోన వైరస్ కు హోమియో మందును స్పాన్సర్ చేస్తూ ఆ మందును తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సులహాదారు అయిన శ్రీ పోకల చందర్ గారికి ప్రప్రథమంగా అందజేశారు. పర్యావరనాన్ని రక్షించుటకు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, జూట్ బ్యాగులు వాడాలన్న సందేశంలో భాగంగా పోకల చందర్ గారికి జూట్ బ్యాగ్ ను కూడా మొదటగా అందజేస్తూ జ్యూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నమశివాయ గారు, గుండా చంద్రమౌళి గారు, బైసాని గారు, మోహన్ గారు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు