ఆరోగ్య శిబిరం నిర్వహించిన అవోపా హైదరాబాద్తేదీ 9.2.2020 రోజున అవోపా హైదరాబాద్ వారు వారి స్వంత కార్యాలయ భవనంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ ఉదయం 9 నుండి మధ్యాహ్నము 12.30 వరకు నిర్వహించారు. ఈ మెడికల్ కాంప్ లో ఆయుర్వేద డాక్టర్ నాగరాజు గారు విచ్ఛేసిన అందరిని పరీక్షించి రోగనిర్ధారణ చేసి తీసుకోవలసిన మందులను ప్రిస్క్రైబ్ చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమశివాయ, ఉపాధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, డా.కె. నాగరాజు, తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున ముఖ్య సలహాదారు, పూర్వాధ్యక్షుడు శ్రీ పోకల చందర్ గారు, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి గారు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అవోపా హైదరాబాద్ వారిని పలువురు ప్రశంశిస్తున్నారు. కామెంట్‌లు