కుమారి దేవకి నందన ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ! అవును. నిజమే ఈ పేరు ను మీరు సరిగ్గానే విన్నారు. గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి ల పేర్లలాగానే పిన్న వయసులో రాష్ట్ర స్థాయి పోటీలలో పలువురు చిచ్చర పిడుగులతో పోటీపడి అలవోకగా నెగ్గి ఔరా అనిపించు కుంటున్న మన తెలుగు తేజం వాసవీ మాత ముద్దుబిడ్డ దేవకి నందన. ఇమే ప్రస్థానం 10వ ఏటే మొదలైంది. ప్రాథమిక పాఠశాలలో ఓనమాలు నేర్చుకుంటూనే చెస్ ఆటపై మక్కువ పెంచుకుని తనదైన శైలిలో ఆడుతూ కోచ్ వద్ద మెళకువలు నేర్చుకుంటూ క్రమ క్రమంగా పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో పోటీలలో నెగ్గుకుంటూ రాష్ట్ర స్థాయి పోటీల్లో తన శక్తియుక్తులను ప్రదర్శించి విజయ సోపానాన్ని చేరుకున్న బాలమేధావి. ఎందరినో మెప్పించిఎన్నో మెడల్స్ ప్రయిజెస్, కప్పులు సాధించిన జ్ఞాని. ఈ అమ్మాయి కి జాతీయ చెస్ పోటీలలో కూడా తన సత్తా చాటి ప్రపంచా చదరంగం పోటీలలో పాల్గొనడానికి ఎంపికైంది. 2017 లో 7 సం ల క్యాటగరి లో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో 3వ బహుమతి పొంది నేషనల్ పోటీలో 11వ స్తానం సంపాదించింది. 2018 లో నేషనల్ పోటీలలో 10వ స్తానం సంపాదించి కామన్ వెల్త్ ఛాంపియన్షిప్ లో 8వ స్తానం పొందింది. 2019లో 9 సం.ల రాష్ట్ర స్థాయి పోటీలో విజేతై నేషనల్ స్కూల్ గేమ్స్ లో 8వ స్తానం సంపాదించి తదుపరి అదే క్యాటగారిలో నేషనల్ గర్ల్స్ సిల్వర్ మెడల్ సాధించి జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడి 2020లో అమెరికాలో జరుగు ప్రపంచ 10వ సం బాలుర చదరంగం పోటీలలో, ఆసియన్, కమన్వెల్త్ మరియు వెస్ట్ ఆసియా చదరంగం పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించింది. ఈ అమ్మాయి వాసవి మాత అనుగ్రహంతో అన్ని పోటీలలో విజయం సాధించి ఆర్యవైశ్యుల కీర్తి పతాకాన్నెగురవేయలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి.
పిన్న వయసులోనే ప్రపంచ చదరంగం పోటిలలో పాల్గొనుచున్న కుమారి దేవకి నందన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి