అవోపా హబ్సిగూడా మొదటి కార్యవర్గ సమావేశము


అవోపా హబ్సిగూడా మొదటి కార్యవర్గ సమావేశము తేదీ 5.1.2020 రోజున సంస్థ పూర్వాధ్యక్షుడు శ్రీ మద్ది హనుమంతరావు గారి స్వగృహములో నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీ శివకుమార్ గారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి భవాని, ఆర్థిక కార్యదర్శి హరిప్రసాద్, పూర్వాధ్యక్షుడు మద్ది హనుమంతరావు, పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు, చిన్నయ్య, లక్ష్మీనారాయణ, విష్వెశ్వరరావు, తులసిరాంగుప్త, ఉపాధ్యక్షులు సుధాకర్, లక్మయ్య, కృష్ణయ్య కార్యవర్గ సభ్యులు హితేంద్రనాథ్, రాజమన్నార్, శ్రీనివాస్ రావు, రామలింగేశ్వరరావు, ప్రశాంత్, సత్యనారాయణ తదితరులు హాజరై 2020 సంవత్సరపు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ను ఆమోదించారు.  తదుపరి షడ్రసోపేతమైన విందుతో కార్యక్రమాన్ని ముగించగా అందరూ ఆనందంగా గృహోన్ముఖులైనారు. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులను, నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అవోపా అద్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, వారి కమిటీ, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకుడు నూకా యాదగిరి మరియు వారి సంపాదక వర్గము అభినందనలు తెలియజేయుచున్నవి. 


అవోపా హబ్సిగూడా మొదటి సమావేశ వీడియో


 


కామెంట్‌లు