టౌన్ అవోపా మహబూబ్నగర్ వారి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం


తేదీ 26.1.2020 రోజున వాసవి కన్యకపరమేశ్వరి దేవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా  టౌన్ అవోపా అద్వర్యంలో టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ అధ్యక్షతన పాలమూరు  బ్రాహ్మణ వాడి లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి  దేవి ఆలయం లో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అందరికి భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, అవోపా సభ్యులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, నాయకులు, మరియు ఆర్యవైశ్య అన్ని సంఘాల అధ్యక్షులు,నాయకులు, ఆర్యవైశ్యులు, మహిళలు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమమును విజయవంతం చేసిన కార్యదర్శులకు, అవోపా కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమంలో పాలుపంచుకున్న మహిళలకు, పిన్నలకు, పెద్దలకు టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు.


కామెంట్‌లు