మంచిర్యాల జిల్లా అవోపా మరియు లక్సెట్టిపేట పట్టణ అవోపా ఆధ్వర్యంలో స్థానిక ఉమామహేశ్వర కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, సోషల్ విషయాలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 24 పాఠశాలలనుండి 84 విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా అవోపా అధ్యక్షుడు మాట్లాడుచూ విద్యార్థులలో నిక్షిప్తమైన మేధాశక్తిని వెలికి తీయుటకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుచున్నామని మరియు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించుటకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథి మాట్లాడుచూ విద్యార్థులను ప్రోత్సహించు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, పేద విద్యార్థులతో సహా మెరిట్ విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ఆర్థిక వనరుల తోడ్పాటు గావించి వారిని డాక్టర్లుగా ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా అవోపా అధ్యక్షుడు గుండా సత్యనారాయణ, రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు గుండా ప్రభాకర్, ముఖ్య అతిథిగా మండల విద్యా శాఖాధికారి కాసుల రవీందర్, కొంజెర్ల శ్రీనివాస్, జిల్లా అవోపా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కట్కూరు కిషన్, ప్రత్యేకాహ్వానితునిగా ప్రిన్సిపాల్ శ్రీపాదరావు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా అవోపా మరియు లక్సెట్టిపేట పట్టణ అవోపా ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి