అవోపా జమ్మికుంట వారు నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు

తేది 12.1.2019 రోజున  సంక్రాంతి పండుగ సందర్భంగా  సువర్ణ ఫంక్షన్ హాల్లో అవోపా జమ్మికుంట మరియు సిటి కేబుల్ వారు సంయుక్తంగా బాలికలకు, మహిళలకు సంక్రాంతి సంప్రదాయాలను గుర్తుచేస్తూ మహిళలకు సృజనాత్మకతను, పోటీతత్వాన్ని మరియు పరస్పర పరిచాయలను పెంపొందించుటకు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీదారులు పర్యావరణ పరిరక్షణ, సంక్రాంతి పండుగ ప్రభావాన్ని, సంప్రదాయాలను మరియు కేంద్ర ప్రభుత్వ స్కిం లైన బేటీ బచావో బేటీ పడావో లాంటి సందేశాలనందిస్తూ ఉత్సాహంతో ముగ్గులు వేశారు. ఈ పోటీలలో మొదటి, రెండవ, మూడవ బహుమతులు గెల్చు కున్నవారు  బాలికల విభాగంలో 9వ తరగతి విద్యార్థినులు అమూల్య, లక్ష్మీప్రసన్న మరియు 5వ తరగతి  విద్యార్థినిల అమృత వర్షిణి  మహిళల విభాగంలో కిరణ్మయి, శారద, భాగ్యలక్షిలు.  ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా డా.ముక్క శ్రీవాణి, డా.ముక్క మౌనిక, శ్రీమతి నిరూపరాణి, శ్రీమతి అంజలి గారలు వ్యవహరించారు. అత్యంత ఉత్సాహంతో జరిగిన ఈ కార్యక్రమం అవోపా అధ్యక్షుడు ఐతా సుధాకర్, ప్రధాన కార్యదర్శి బాదం సురేష్ బాబు, అకినేపల్లి శ్రీనివాస్, కె. నగేష్ యాద శ్రీనివాస్, రాంబాబు, కాశివిశ్వనాథ్,  నవిన్ కుమార్, రవికంటి పవన్, సురేందర్, గుండా తిరుపతయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళలు పిల్లలు పాల్గొన్నారు. 




కామెంట్‌లు