అలిశెట్టి ప్రభాకర్ సాహితీ పురస్కారం -2020


అలిశెట్టి ప్రభాకర్ సాహితీ పురస్కారం -2020 ని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత, స్వయానా హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న గాజోజు నాగభూషణం కు 12 వ తేదీ ఉదయం 11 గంటలకు కరీంనగర్ ఫిల్మ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేయడం జరిగింది. అతిథులుగా 14 భాషలు తెలిసిన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, Avopa ప్రధాన కార్యదర్శి, సాహితీవేత్త నిజాం వెంకటేశం, పురస్కార ప్రదాత , ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కవి, సినీ విశ్లేషకులు, సెన్సార్ బోర్డ్ మెంబర్ వారాల ఆనంద్, లోక్సత్తా నరెడ్ల శ్రీనివాస్, కవి అన్నవరం దేవేందర్, అధ్యక్షత వహించిన కవి కందుకూరి అంజయ్య, కవి కూకట్ల తిరుపతి, కార్యదర్శి cv  కుమార్, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం, సినీ విశ్లేషకులు పొన్నం రవిచంద్ర హాజరయ్యారు. వచ్చే సంవత్సరం ఇదే రోజున ప్రభాకర్ కవితల తమిళ, ఇంగ్లీష్ అనువాద కవితా సంకలనాలు ప్రచురించి ఆవిష్క రిద్దామని, దాని బాధ్యత తాను తీసుకుంటానని నిజాం వెంకటేశం తెలియచేశారు.కామెంట్‌లు