కరీంనగర్ టౌన్ అవోపా భవన నిర్మాణ సమావేశము


తేదీ 19.1.2020 రోజున కరీంనగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు కట్కూరు సుధాకర్ అధ్యక్షతన జరిగిన భవన స్థల దాతల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, చీఫ్ కో-ఆర్డినేటర్ గుండా చంద్రమౌళి, సలహాదారు తోట లక్ష్మణ్ రావు, చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం, కార్యదర్శి పాత వెంకటనర్సయ్య, కరీంనగర్ జిల్లా అవోపా అధ్యక్షుడు రామకృష్ణ, టౌన్ అవోపా కరీంనగర్ కార్యదర్శి, కోశాధికారి తదితరులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో టౌన్ అవోపా అధ్యక్షుడు సుధాకర్ గారు మాట్లాడుచూ టౌన్ అవోపా కార్యాలయం గురించి వరాహస్వామి గుడి పరిసరాల్లో 220 చ.గ.ల ఓపెన్ ప్లాట్ సుమారు 22 లక్షలతో కొన్నామని అందులో భవన నిర్మాణానికి సుమారు 60 లక్షల వరకు ఖర్చు కాగలదన్న అంచనాలు ఉన్నాయని తెలిపినారు. అందులకు ఆహుతులు 50 మంది వరకు స్పందించి సుమారు 30 లక్షలు భవన నిర్మాణానికి విరాళాలిచ్చారని, తాము త్వరలో అవోపా భవన నిర్మాణము ప్రారంభించగలమని తెలిపినారు. సమావేశంలో విరాళాలిచ్చిన పై వారిని సన్మానించారు. ఇందులకు భవన నిర్మాణం త్వరలో చేపట్టి అందులో ప్రారంభ సమావేశము నిర్వహించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు అతని కమిటీ అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి. 



కామెంట్‌లు