ఆశ్రమ వాసులకు శాశ్వత అన్నదానానికి ఆర్థిక సహాయము


తేదీ 22.12.2019 రోజున అవోపా  నాగర్ కర్నూల్ వారు స్థానిక "శ్రీ జ్ఞానేశ్వర వాత్సల్య మందిర్" ఆశ్రమం లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు శ్రీ ఫణికుమార్ వారి కుటుంబ సభ్యులతో విచ్ఛేసి గత నెలలో స్వర్గస్తులైన వారి పితృదేవుల జ్ఞాపకార్థం ఆశ్రమ వాసులకు శాశ్వత అన్నదానం చేయుట గురించి రు.12,100లు అందజేశారు. పెద్ద మనసుతో చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో అవోపా నాగర్ కర్నూల్ కార్యదర్శులు సాయి శంకర్, రవిప్రకాష్, ఉపాధ్యక్షుడు కె.పి.ప్రసాద్, జిల్లా బాధ్యులు వెంకటరాజు, బొడ్డు పాండు, ఆశ్రమ స్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త ఆకారపు విశ్వనాథం గారు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యం చేసిన అవోపా అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు