అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి నాలెడ్జ్ షేరింగ్ మీట్


అవోప బ్యాంక్మెన్ చాపుటర్ వారు   తేదీ 8.12.2019 రోజున కాచిగూడ వైశ్య హాస్టల్లో "నాలెడ్జ్ షేరింగ్ మీట్" కు శ్రీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథి గా విచ్చేయగా శ్రీ.పి.వి రమణయ్య గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో  పేరెన్నికగన్న బ్యాంక్మెన్ అధికారులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ కె. రామనందం గారు ప్రార్థన గీతం అలపించగా యూనియన్ బ్యాంకు ఏ.జి.ఎం శ్రీ ప్రదీప్ కులకర్ణి గారు బ్యాంకింగ్ బిజినెస్, డైనమిసం, బ్యాంక్ మెర్జర్స్, ఎన్.సి.ఎల్.టి లావాదేవీల గురించి సుదీర్ఘ ఉపన్యాసమిచ్చారు. కెనరా బ్యాంకు ఉద్యోగి మరియు పదవి విరమణ చెందిన ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు. వై.వి సుబ్బారావుగారు మరియు జె.వి.రత్నం గారలు బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ లకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేసారు. స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీమతి శైలజ గారు మరియు ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు మూచువల్  ఫండ్స్ నుండి అజయ్ గారు ఆస్తుల పెంపు మరియు పెట్టుబడుల గురించి విశధీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు 80 మందికి మధ్యాహ్నభోజనం శ్రీ కొత్త రమణ కిషోర్ గారు ఏర్పాటు చేశారు. శ్రీ సురేంద్రనాథ్ మురళీకృష్ణ, మద్ది హనుమంతరావు, టి.ఎల్.వి.రావు,  కె.వి.ఎస్. గుప్త తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కామెంట్‌లు