ప్రతిభకు గుర్తింపు - బంగారు పథకాల ప్రదానం


భారత ఫ్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జన్మదినాన్ని పురస్కరించుకుని తేదీ 22.12.2019 రోజున అవోపా హనుమకొండ కార్యాలయ సమావేశ మందిరంలో అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2018-19 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఆ పై కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన 61 మంది ఆర్యవైశ్య  విద్యార్థినీ, విద్యార్థులందరికి   బంగారు పథకంతో బాటు రు.1,116 ల పారితోషకాన్ని పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు,సమావేశపు ముఖ్య అతిథి, వరంగల్ ప్రథమ పౌరుడు శ్రీ గుండా ప్రకాశ్ గారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుచూ సర్వదాన ప్రధానం విద్యాదానం అని, విద్యతో ఏ దేశంలో నైనా గౌరవంగా జీవించవచ్చని, ప్రతిభతో గుర్తింపునొంది ఉన్నత స్థాయి చేరుకుని సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ,  సంస్థ ఆదాయంలో కొంత భాగం ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం కేటాయించి అందిస్తామని పేర్కొన్నారు. 'నీట్' జిప్మర్ 'ఎంసెట్' పోటీ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన మాదంశెట్టి శివానికి అదనంగా రు.5116 లు అందజేశారు. సమావేశపు మరొక ముఖ్య అతిథి ట్రాన్స్కో చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ బుస్సా అశోక్ గారు తేదీ 15.12.2019 సమావేశంలో నార్కడమల్లి శాయిలక్ష్మి కి ఉన్నత చదువుల కోసం రు.10,000 లు అందించారు. ఎల్లంకి రవీందర్ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి, ముఖ్య అతిథిగా వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ గారు, విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్, జిల్లా అవోపా అధ్యక్షుడు కంభంపాటి రమణయ్య గారు, సురేందర్ గారు, విద్యా కమిటీ చైర్మన్ గంప అశోక్ కుమార్, సభ్యులు మాడిశెట్టి శ్రీనివాస్, డా.రజిత, జ్ఞానేశ్వర్, అనుగం జనార్దన్, కల్లూరి శ్రీనివాస్ తదితరులు హాజరుకాగా సమావేశం అంతయూ అవోపా హనంకొండ ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం మరియు కోశాధికారి ఎం.వి.అప్పారావు గారల నేతృత్వంలో సంపన్నమైనది. ఇందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయుచున్నవి.   కామెంట్‌లు