అవోపా మహబూబ్నగర్ వారిచే వాసవి మెడల్స్ ప్రదానం


ఈరోజు తేదీ 29.12.2019 రోజున మహబూబ్నగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు వాసవి మెడల్స్ ప్రదానం చేయు కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమానికి చెరుకుపల్లి రాజేశ్వర్ గారు, జిల్లా అవోపా అధ్యక్షుడు పోల శ్రీధర్ గారు , మరియు రాష్ట్ర అవోపా నాయకులు కలకొండ సూర్యనారాయణ గారు, కొండూరి రాజయ్య గారు, మరియు టౌన్ అవోపా కార్యవర్గ సభ్యులు హాజరైనారు. 35 మంది ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్బంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి మహబూబ్నగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశాడుకామెంట్‌లు