అవోపా చెన్నూర్ వారి వికలాంగుల దినోత్సవ వేడుకలు

తేదీ 3.12.2019 రోజున ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా చెన్నూర్ ఆవోపా  ఆధ్వర్యంలో సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమములో 9 మంది వికలాంగులను సన్మానించి వారికి కావలసిన దుస్తులు, చీరలు మరియు పండ్లు పంపిణీ చేయడం  జరిగింది. ఈకార్యక్రమములో ఆవోపా అధ్యక్షులు పుల్లూరి సత్తయ్య,కార్యదర్శి చిగురాల ఓంప్రకాష్ , కోశాధికారి గన్ను శ్రీరాములు, ఆవోపా కార్యవర్గ సభ్యులు చిలువేరు మల్లిక్, గర్రెపల్లి వెంకటనర్సయ్య తదితరులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ప్రాయోజిత కార్యక్రమము చేసిన అవోపా చెన్నూర్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.కామెంట్‌లు