మంచిరియాల్ జిల్లా ఆవోపా మరియు లక్సట్టిపేట్ పట్టణ ఆవోపా కలిసి లక్సట్టిపేట్ లో నిర్వహించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి

పొట్టి శ్రీరాములు వర్ధంతిని మంచిర్యాల జిల్లా మరియు లక్సట్టిపేట్ పట్టణ అవోపా సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  స్థానిక గాంధీ  చౌక్ లో గల  పొట్టి శ్రీరాములు  విగ్రహానికి  పూలమాలాలంకరణ  గావించిన  అనంతరం  స్థానిక  ప్రభుత్వ ఆసుపత్రిలో  రోగులకు  పండ్లు,  బ్రెడ్  పంపిణి  చేశారు.  ఈ  సందర్బంగా  ఆవోపా  జిల్లా  అధ్యక్షులు  గుండా  సత్యనారాయణ  ప్రసంగిస్తూ  అమరజీవి  పొట్టి  శ్రీరాములు  మద్రాస్ రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలు విడిపోవుటకు మరియు ఆంధ్రప్రదేశ్  అవతరణ  కొరకు  58 రోజులు  ఆమరణ  నిరాహార  దీక్ష  చేసి  ప్రాణ   త్యాగం చేసిన  మహనీయుడని, ఆయన  దీక్ష  ఫలితమే  ఆంధ్రప్రదేశ్   రాష్ట్రం అవతరించిందని అందులకే ఆయన ఆర్య  వైశ్యుల  ఆరాధ్యదైవం  అయ్యాడని కొనియాడారు. తదుపరి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో  రాష్ట్ర అవోప ఉపాధ్యక్షులు నలుమాసు  కాంతయ్య,  ఆవోపా  జిల్లా  అధ్యక్షులు  గుండా  సత్యనారాయణ,  ఆవోపా  రాష్ట్ర  ఉపాధ్యక్షులు  గుండా  ప్రభాకర్  కార్యవర్గ  సభ్యులు  కొంజర్ల  శ్రీనివాస్  ఆవోపా  నాయకులు  రాచర్ల  సత్యనారాయణ  కటుకూరి  కిషన్  అక్కెనపెల్లి  రవీందర్  అక్కెనపెల్లి  కోటయ్య  మైలారపు  సుధాకర్  గుండా  సంతోష్  వొజ్జల  శ్రీనివాస్  కటుకం  రమేష్  తదితరులు  పాల్గొన్నారు.     


                          


కామెంట్‌లు