తేదీ 25.12.2019 రోజున ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య హాస్టల్ లో తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సమావేశము నిర్వహించినారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు అధ్యక్షత వహించగా ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, ముఖ్య సలహాదారు పోకల చందర్, సాంకేతిక సలహాదారు మునిగేటి సత్యనారాయణ, సలహాదారు తోట లక్ష్మణరావు, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి, చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం, అవోపా నగర్ కన్వీనర్ ఎం.నాగేశ్వరరావు, సుబ్బారావు, బాపిరాజ, అవోపా రాష్ట్ర పూర్వాధ్యక్షుడు కాసం అంజయ్య, వేదప్రకాశ్, కరీంనగర్ అవోపా జిల్లాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశములో అవోపా నగర్ లెక్కలు, దస్తావేజులు, సభ్యుల వివరములు సంస్థకు ఇవ్వవలసిన డబ్బులు జనవరి నెలలో నాగేశ్వరరావు గారు ఇవ్వాలని, తదుపరి అవోపా నగర్ సమావేశము 5.1.2020 రోజున నిర్వహించాలని తీర్మానించారని అందులకు అవోపా నగర్ కన్వీనర్ నాగేశ్వరరావు అంగీకరించారని తెలియజేశారు. నాగేశ్వరరావు అవోపా నగర్ లెక్కలు దస్తావేజులు సమర్పించిన తరువాత తెలంగాణ రాష్ట్ర అవోపా లెక్కలు సంస్థ ఆడిటర్ గారిచే ఆడిట్ చేపించి మహాజనసభలో చింతా బాలయ్య గారు సమర్పించాలని తీర్మానించడమైనదని తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర అవోపా జమ ఖర్చుల వివరాలు ఆర్థిక కార్యదర్శి సమర్పించగా ఆమోదించుచూ సరియైన పట్టికలో సమర్పించాలని తీర్మానించారు. తదుపరి రాష్ట్ర అవోపా నిర్వహించు అవోపా న్యూస్ బులెటిన్ ఖర్చులను ఆమోదించుచూ అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారు అమెరికా పర్యాటనలో నున్ననూ ఎట్టి విఘాతము కలుగకుండా రాష్ట్రంలోని అవొపాలు చేపట్టే కార్యక్రమాలు విపులంగా వివరించుచూ రంగు రంగుల ఫొటోలతో సకాలంలో సభ్యులకు న్యూస్ బులెటిన్ అందించడంలో తగు శ్రద్ధ తీసుకుంటున్నాడని, అభినందిస్తూ తీర్మానించారని తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సమావేశము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి