This is header
కరీంనగర్ జిల్లా అవోపా ఈ.సి మీటింగ్


తేదీ 10.12.2019 రోజున కరీంనగర్ జిల్లా అవోపా వారు శ్రీ పి.వి రామకృష్ణ గారి అధ్యక్షతన తారక బంకేట్ హల్ కరీంనగర్లో వారి రెండు సంవత్సరముల పదవి కాలం విజయవంతంగా ముగిసినందులకు జిల్లా ఈ.సి మీటింగ్ జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో కోనరావుపేట కు చెందిన పేద మహిళ అయినటువంటి శ్రీ మతి యాద లక్ష్మికి సేవా దృక్పథంతో ఒక వెట్ గ్రైండర్ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంజి స్వరాజ్యబాబు గారు, శ్రీ తోట లక్ష్మణరావు స్టేట్ అవోప సలహాదారు శ్రీ జంధ్యం మధుకర్ చైర్మన్ శాతవాహన కమిటీ, కరీంనగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు కట్కూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు,  తమ కుటుంబ సభ్యులతో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.





This is footer
కామెంట్‌లు