ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు


తేదీ 31.12.2019 రోజున మంచిర్యాల జిల్లా ఆవోపా  మరియు పట్టణ ఆవోపా ఆధ్వర్యములో లక్సట్టిపేట్ కన్యకా పరమేశ్వరి టెంపుల్ లో  ఆవోపా అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు సమావేశమై వాసవి మాత చిత్ర పటానికి జ్యోతి ప్రజల్వన గావించి పూలమాల వేసి 2019 సంవత్సరమునకు వీడుకోలు 2020  సంవత్సరమునకు ఆహ్వానం పలుకుతూ ఆంగ్ల న్యూ ఇయర్ కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమములో ఆవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, పట్టణ ఆవోపా  అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్,  ఆవోపా రాష్ట్ర  ఉపాధ్యక్షుడు  గుండ ప్రభాకర్, ఆవోపా రాష్ట్ర  కార్యదర్శి  వొజ్జెల  రాజమౌళి, ఆవోపా  నాయకులు ఆర్. సత్యనారాయణ, కే. కిషన్, బి. సత్తయ్య,  అక్కనపెల్లి  రవీందర్, గుండ సంతోష్,  వి.కృపాకర్, పాలకుర్తి  వెంకటేశ్వర్లు, కాసం కుమార్, రాగుల రాజమౌళి, అక్కనపెల్లి  కోటయ్య, వి. రవీందర్,  ఉతూరి  జయము, బజ్జురీ మోహన్, బి. అంజయ్య, ఎల్లంకి సత్తయ్య, ఇతరులు అధిక సంఖ్యలో ఆవోపా సభ్యులు పాల్గొని ఇంగ్లీష్ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుకున్నారు. ఇందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపుతూ తెలుగు నూతన సంవత్సరమైన ఉగాదిని కూడా ఘనంగా జరుపుకోవాలని సూచిస్తున్నవి.


కామెంట్‌లు