అవోపా న్యూస్ బులెటిన్ పై కురుస్తున్న ప్రశంసల జల్లు


అవోపా న్యూస్ బులెటిన్ మరియు బులెటిన్ గూగుల్ పేజీలో ప్రచురిస్తున్న వార్తలను చదవడానికి సమయం కేటాయిస్తూ ఎచ్చట నున్నా, ఏ సమావేశములో పాల్గొనుచున్నా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు చదువుతూ తగు సలహాల నోసగుతూ అవోపా న్యూస్ బులెటిన్ ను ఎంతగానో అభిమానిస్తూ క్రమ క్రమంగా వృద్ధి చెందుతున్న పేపర్ సర్కులేషన్ కు అభినందనలు తెలుపుతూ తనవంతు సహాయముగా యూనిట్ అవోపాలను ఉత్తేజ పరుస్తూ వారిచే వార్తలను వ్రాపించి ఫోటోలను పంపునటుల ఉత్సాహపరుస్తూ బులెటిన్కు వెన్నుదన్నుగా నిలుస్తూ  ఎడిటర్గా నా బాధ్యతను గుర్తు చేస్తూ, వెన్నుతట్టి అభిమానిస్తూ గూగుల్ పేజీలో వస్తున్న వార్తలను క్షణక్షణం చదువుతూ ఉత్తేజ పరుస్తూ పలువురిచే చదువింపజేస్తున్న తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు నా చిరకాల మిత్రుడు శ్రీ పోకల చందర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.తెలంగాణ రాష్ట్ర అవోపా మాజీ చీఫ్ ఎడిటర్, కవిరత్న, వరల్డ్ ఆర్యవైశ్య ఆర్గనైజేషన్ సలహాదారు శ్రీ చింతల శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికప్పుడు బులెటిన్ వార్తలను చదివి నన్ను వారి కవితా ధోరణిలో ప్రశంసిస్తూ అభినందిస్తూ ఉత్తేజపరుస్తూన్నందులకు వారికి కూడా హృదయ పూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు కూడా నన్ను అభిమానిస్తూ ఎన్నో సాధక బాధలనోర్చి బులెటిన్ ప్రచురిస్తున్న విధానాన్ని గమనించి బులెటిన్ భావా జాలాన్ని సమర్థిస్తూ బులెటిన్ మనుగడకు చేయూత నిస్తున్నందులకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేసు కుంటున్నాను.తెలంగాణ రాష్ట్ర అవోపా సాంకేతిక సలహాదారు, మాజీ వాటర్ బోర్డు డైరెక్టర్, హుడా డైరెక్టర్ అయిన శ్రీ మునిగేటి సత్యనారాయణ గారు కూడా బులెటిన్ ప్రచురిస్తున్న విధానాన్ని, కవర్ చేయుచున్న విషయాలను ప్రశంసిస్తూ వాట్సఆప్లో తెలియజేసారు, వారికి నాయొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేయుచున్నాను.అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ గారు కూడా వారు చేయు చున్న కార్యక్రమాలను చక్కగా వివరిస్తూ గూగుల్ పేజీ ద్వారా తెలియజేయుచున్నామని ప్రశంసించారు, వారికి నాయొక్క కృతజ్ఞతలు బులెటిన్ ద్వారా తెలియ జేసుకుంటున్నాను. బులెటిన్ వెలువడుచున్న పద్దతిని, కవర్ చేయుచున్న సమాచారం గూర్చి, తెలియ జేయుచున్న విషయాల గూర్చి చాలా మంది ఫోన్ ద్వారా వాట్సాఅప్ ద్వారా అభినందిస్తూ, ఉత్తేజపరుస్తూ బులెటిన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూన్న కేరళ రాష్ట్ర అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ కృష్ణ తేజ గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి గారు, స్వరాజ్య బాబు గారు,  మాజీ అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు పి.ఎస్.ఎన్. మూర్తి గారు, ఉమ్మడి అవోపా పూర్వాధ్యక్షులు శ్రీ వేముల రామకృష్ణ గారు, శ్రీ కాసం అంజయ్య గారు, శ్రీ బెల్ది శ్రీధర్ గారు, అవోపా హనుమకొండ అధ్యక్షుడు శ్రీ ఎల్లంకి రవిందర్ గారు, అవోపా మంచిర్యాల అధ్యక్షుడు గుండా సత్యనారాయణ గారు, శాతవాహన రీజినల్ ఉపాధ్యాక్షుడు జంధ్యం మధుకర్ గారు, నాగర్ కర్నుల్ జిల్లా అవోపా అధ్యక్షుడు పోలా శ్రీధర్ గారు తదితర సభ్యులు ఆర్యవైశ్యుల సోదరీ సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అవోపా న్యూస్ బులెటిన్ కు చందాదారులను చేర్పిస్తూ, వివాహ వాణిజ్య ప్రకటనలను సేకరిస్తూ, బులెటిన్ ద్వారా, వెబ్సైటు ద్వారా, గూగుల్ పేజీ ద్వారా ఇప్పించిన వివాహ ప్రకటనలకు కార్యరూపం దాలుస్తూ సుమారు 9 వివాహాలు జరిపించి బులెటిన్ కు దాదాపు 15 వేల రూపాయల కార్పస్ ఫండ్ జమచేపించిన అవోపా వనపర్తి జిల్లాధ్యక్షుడు, బులెటిన్ చందా దారుల కమిటీ చైర్మన్ శ్రీ ఎం.ఎన్.రాజ్ కుమార్ గారికి నాయొక్క ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. 


 


కామెంట్‌లు