ఐఫా వారి కార్తీక మాస వనభోజనాలు మరియు ఆరోగ్య శిబిరం

తేదీ17.11.19 ఆదివారం రోజున అఖిల భారత అవోపాల ఫెడరేషన్ వారు మరియు ఆర్యవైశ్య సంఘం కూకట్పల్లి వారు సంయుక్తంగా మియాపూర్ లోని ధర్మక్షేత్రం వద్ద కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో భోజనాలనంతరము యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెడికల్ హెల్త్ స్క్రినింగ్ క్యాంప్ ను నిర్వహించారు. అనంతరము మెడికల్ క్యాంప్ ను నిర్వహించిన డాక్టర్స్ ను సత్కరించారు. ఆర్య వైశ్య సంఘం కూకట్పల్లి అధ్యక్షుడు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన గజ్జల యోగానంద్ గారు ఐఫా జాతీయ అధ్యక్షుడు శ్రీ బెల్డి శ్రీధర్ మరియు సెక్రెటరీ జనరల్ కె.కోటేశ్వర రావు గారిని, సభ్యులు మైలావరపు లక్ష్మీనారాయణ, సోమశేఖర్ గార్లను సత్కరించారు.కామెంట్‌లు