తేదీ 5.9.2019రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు భువనగిరి జిల్లా అనాజిపూర్ గ్రామ జిల్లా పరిషద్ హై స్మూల్ విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్భంగా క్విజ్, ఏలోకేషన్, ఏస్సే రైటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు 17.11.2019 కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పంచ నున్నారు. ఈ పోటీలలో సుమారు 120 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోధ్యాయుడు దశరథరెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ కోకో పోటీలలో 4 సార్లు మన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించిన ఆటో డ్రైవర్ కూతురు నీలం స్రవంతి ఈ స్కూలులో 10వ తరగతి చదువుచున్న బీద విద్యార్థిని. ఈమె క్రీడాస్ఫూర్తికి మెఛ్చిన కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వశాఖ ఈమె పై చదువులకు మరియు క్రీడల్లో శిక్షణ పొందుటకు హర్యానా లోని ధర్మశాలలోని స్పోర్ట్స్ కౌన్సిల్ లో నెలకు రు.10000 చొప్పున ఉపకార వేతనము ను 5 సంవత్సరములకు అనగా మొత్తం రు. 6 లక్షల స్కాలర్షిప్ ను సాంక్షన్ చేసిందని తెలియజేసారు. ఇందులకు అధ్యక్షుడు మరియు వారి కమిటీ సభ్యులు ఆమెను అభినందిస్తూ ప్రత్యేక బహుమతితో సత్కరించారు.
This is header
• Avopa News Bulletin
This is footer
బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల నిర్వహణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి