తేదీ 17.11.2019 ఆదివారం రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు కార్తీక వనభోజనాల కార్యక్రమము భువనగిరి జిల్లాలోని నాగిరెడ్డిపల్లిలోని సద్గురు రామానంద ఆశ్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పోకల చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 120 కుటుంబాలకు పైగా వైశ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు అనాజ్పూర్ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఆటలపోటీలు, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఆశ్రమ సమీపంలో నున్న పాఠశాల పిల్లలకు గైడ్లు & పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఆశ్రమ సమీపంలో నివసించేవృద్ద మహిళలకు చీరెలు బ్లాంకెట్లు అందజేయబడ్డాయి. 5 లక్షల రూపాయల పర్సుతో క్రీడలలో జాతీయ ఛాంపియన్‌గా ఎంపికైన ఆ పాఠశాల నుండి ఒక అమ్మాయి ముఖ్య అతిథిగారిని సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున నిజాం వెంకటేశం ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ కోఆర్డినేటర్ చంద్రమౌలి గుండా మరియు కాచిగూడ వైశ్య హాస్టల్ జె.టి.రవీంద్రనాథ్ గుప్తా గారు కూడా పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో కొలన్ పాక, కోటిలింగేశ్వరాలయము, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు. కార్యక్రమమంతయూ కార్యవర్గ సభ్యుల చురుకైన పాత్రతో మరియు అధ్యక్షుడు పి.వి.రమణయ్య గారి నేతృత్వంలో ఘనంగా జరిగినది. కార్యక్రమము విజయవంతమైనందులకు పలువురు సంతోషం వెలిబుచ్చారు.
అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి కార్తీక వన భోజనాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి