తేదీ 24.11.2019 రోజున తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు హనుమకొండలోని మాస్టర్ జీ కాలేజీ క్యాంపస్‌లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చే ఎంపిక కాబడిన 20 మంది గ్రూప్2 సర్వీసెస్ అభ్యర్థుల యొక్క సన్మాన కార్యక్రమానికి కీ నోట్ స్పీకర్‌గా హాజరై తన ఆకట్టుకునే ప్రసంగంతో వారిని ప్రేరేపించి నిజాయితీగా మరియు నిస్వార్థంగా విధులు నిర్వర్తించాలని ఉద్బోధించారు. ఈ గ్రూప్ 2 పరీక్షలకు సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో తెలంగాణ రాష్ట్ర లోని నలుమూలల నుండి సుమారు 60 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని తెలియజేసారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన సుమారు 20 మంది డిఫూటి తహశీల్దార్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఎ.ఎస్.ఐ.లు మరియు వాణిజ్య పన్నుల అధికారులుగా ఎంపికైన వారున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దేవునూరి ఆనంద్ నిర్వహించగా, జి.వీరారెడ్డి, మిమిక్రి అంజనకుమార్, సి.డబ్ల్యూ.సి చైర్మన్ మండల పరుశరాములు, చందర్, శంకర్, శ్రీనివాస్, శివప్రసాద్ బూర రవి, అరవింద్, పరమేశ్, పాషా, ఓంకార్, దీక్షిత్, శివరోహిత్ తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ 2 లో విజేతలైన అధికారులకు సన్మాణాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి