ఐఫా వారు తేదీ 29.11.2019 రోజున హోటల్ తాజ్ దక్కన్, బంజారాహిల్స్ లో వైశ్య ప్రముఖులకు 'ప్రైడ్ ఆఫ్ వైశ్య' అను బిరుదు ప్రదానంచేయు కార్య క్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్ఛేసిన ఆర్యవైశ్య లెజెండ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ.టి.జి.వెంకటేష్ గారి ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పేరెన్నికగన్న 9 మంది ఐ.ఆర్.ఎస్, ఐ.ఏ.ఎస్ అధికారులకు మరియు వైశ్య వ్యాపార ప్రముఖులు ఇద్దరికి 'ప్రైడ్ ఆఫ్ వైశ్య' అను బిరుదులు ప్రదానం చేసి వారిని ఘనంగా సత్కరించారు. ప్రౌడ్ ఆఫ్ వైశ్య ఆర్యవైశ్య బిరుదు గ్రహితల్లో ఐ.ఆర్.ఎస్ అధికారులైన శ్రీ వాస శేషగిరి రావు, శ్రీ నారాయణం మధుసూదన్ రావు, శ్రీ. మంచికంటి సుబ్రమణ్యం, ఇరుకుల్ల సరిష్ కుమార్, ఐ.ఏ.ఎస్ అధికారులు శ్రీ.ఎం.జగదీశ్వర్, డా.నారాయణ్ భారత్ గుప్త, శ్రీ. కొత్తమాసు దినేష్ కుమార్, శ్రీ ఇమ్మడి పృద్వితేజ్, ఐ.పి.ఎస్ ఉప్పల శివకుమార్ మరియు వ్యాపార ప్రముఖులు కె. శ్రీనివాస్, విక్రమ్ కైలాష్ గారలున్నారు. ఆద్యంతం ఉత్సాహ భరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవోపా తరఫున సంస్థ ముఖ్య సలహదారైన పోకల చందర్, సాంకేతిక సలహాదారైన మునిగేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య గారలు మరియు అవోపా హైదరాబాద్ తరఫున అధ్యక్షుడు నమశివయ, రవి భద్రినాథ్లు హాజరై సన్మాన గ్రహితలను అభినందించారు. ఐఫా జాతీయ అధ్యక్షుడైన బెల్ది శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని, సెక్రెటరీ జనరల్ కోటేశ్వరరావు గారు కోశాధికారి మేడా నర్సింలు మరియు సమావేశ నిర్వహణ కమిటీ చైర్మన్ ఫనిరాజ్ గారు, కొచైర్మన్లు సన్యాసిరావు నంబర్మళ్ళు తదితరులు రక్తి కట్టించారు. సన్మాన గ్రహితలు కార్యక్రమ నిర్వాహకులకు ఐఫా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఐఫా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకుడు నూకా యాదగిరి మరియు వారి సంపాదక వర్గము అభినందనలు తెలుపుచున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి