అవోపా పాలమూరు వారి గాంధీ జయంతి వేడుకలు


మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్బంగా పాలమూరు టౌన్ అవోపా అధ్యక్షుడు  బి.టి.ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో  స్థానిక క్లాక్ టవర్ లోని మహాత్మాగాంధీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.. *స్వచ్ఛ్ భారత్* లో భాగంగా మహాత్మాగాంధీ 150 వ జయంతి ని పురస్కరించుకుని 150 మంది మున్సిపల్(పారిశుద్ధ్య) కార్మికులను సన్మానించడం జరిగింది.మరియు ఓబులాయపల్లి సమీపంలోని రామకృష్ణ సేవా ట్రస్ట్ లోని వృద్దులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది...
ఇట్టి కార్యక్రమంలో అవోపా రాష్ట్ర ,జిల్లా నాయకులు, అన్ని ఆర్యవైశ్యసంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు,అందరూ పాల్గొన్నారు. 


కామెంట్‌లు