ఇంగ్లీష్ నిఘంటువుల పంపిణీ


అవోపా నాగర్ కర్నూల్ వారు పెద్ద ముద్దునూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు ఇంగ్లీషు నిఘంటువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవోపా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు పోలా శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను క్షుణ్నంగా అర్థం చేసుకొనుటకు, మరియు కొత్త కొత్త పదాలను నేర్చుకొనుటకు ఈ నిఘంటువును ఉపయోగించుకోవాలని, శ్రద్ధతో చదివి ఉన్నత విద్య నభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు పణికుమార్, బొడ్డు పాండు, కందుకూరి బాలరాజు మరియు కార్యదర్శి రాజయ్య విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


 


కామెంట్‌లు