This is header
లక్సెట్టిపేట ఇంజినీర్స్ డే


తేదీ 15.9.2019 రోజున భారతదేశము గర్వించదగ్గ ఇంజినీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా లక్సట్టిపేట్ ఆవోపా ఆధ్వర్యములో ఇంజినీర్స్ డే శ్రీ కన్యకా పరమేశ్వర టెంపుల్ బీట్ బజార్ లక్సట్టిపేట్ లో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా లక్సట్టిపేట్ దండేపెల్లి మండలాల విద్యార్థినీ విద్యార్థులకు ఉపన్యాస పోటీ నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం బాశెట్టి హరీష్ పంచాయతీ రాజ్ ఇంజనీర్ రుద్ర రాజేశం, ఇర్రిగేషన్ డీప్యూటీ ఇంజనీర్ గార్లకు ఘనంగా సన్మానము చేశారు. పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ జిల్లా అవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ,  ప్రధాన కార్యదర్శి అక్కన పెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కటుకూరి కిషన్, ఆవోపా నాయకులు వొజ్జెల కృపాకర్, కాసం కుమార స్వామి, చిరుమళ్ల శంకర్, గుండ సంతోష్, కటకం అఖిలేష్, కటకం శ్రీనివాస్, నల్ల సత్యం టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. 


This is footer
కామెంట్‌లు