అవోపా లక్సెట్టిపేట ఎన్నికలు

తేదీ 11.8.2018 ఆదివారము రోజున లక్సెట్టిపేట బీట్ బజార్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ  దేవాలయములో అవోపా సర్వ  సభ్య సమావేశము  పాలకుర్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశములో అవోపా లక్సట్టిపేట్  అధ్యక్షుడి ఎన్నిక జరగగా పాలకుర్తి సుదర్శన్ గారు ఏకగ్రీవంగా అధ్యక్షుడి గా  ఎన్నికైనారని ఎన్నికల అధికారి వజ్జల రాజమౌళి తెలిపినారు. 
 ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా ఆవోపా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఆవోపా ఉపాధ్యక్షులు గుండ ప్రభాకర్ మరియు కటకం రమేశ్, కొంజర్ల శ్రీనివాస్, చర్ల సత్యనారాయణ, కొత్త కిరణ్, ఎల్లంకి సత్తయ్య, వొజ్జెల కృపాకర్,  కుమారస్వామి, గుండ సంతోష్, గౌరిశెట్టి సంతోష్ , జెల్ల సత్తయ్య , గంపరవీందర్ , అక్కన్న పెల్లి రవీందర్, తాటికొండ శ్రీనివాస్ , సి .ఎచ్ .శంకర్ , వొజ్జెల శ్రీనివాస్ తదితర 60 మంది ఆవోపా సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన పాలకుర్తి సుదర్శన్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు