శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

లక్సెట్టి పేట లోని శిశుమందిర్ పాఠశాలలో   శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగినవి.ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ గుండా సత్యనారాయణ, అతిథిగా పట్టణ అవోపా అధ్యక్షుడు  పి.సుదర్షన్  గారలు విచ్ఛేయగా పాఠశాల అధ్యక్షడు నల్మా సుకాంతయ్య, ప్రధాన కార్యదర్శి చింత అశోక్,   సబ్యులు అల్లంకి సత్తయ్య, ఎంబడి రామన్న, పాఠశాల ప్రధానాచార్యులు తొగరి పెంటయ్య పాల్గొన్నారు.  ఉట్టి గొట్టిన అనంతరం కృష్ణ వేశధారులైన విద్యార్థులకు పోటీ నిర్వహించి విజేతలకు అవోపా బహుమతులందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి వైశ్య ప్రముఖులు, అవోపా సభ్యులు, పోటీ దారుల తల్లిదండ్రులు అధిక ససంఖ్యలో పాల్గొన్నారని తెలియజేసారు. మంచి ప్రోగ్రాం చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిని వారి కార్యవర్గాన్ని తెలంగాణ అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందిస్తున్నవి.



కామెంట్‌లు