శ్రీ మాడిశెట్టి గోపాల్ గారు వ్యాఖ్యాన రంగంలో దిట్ట. వీరిని రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు గారి 70వ జన్మదినం సందర్భంగా వ్యాఖ్యానం రంగంలో పురస్కారానికి ఎంపిక చేసి తేది 23.8.2019 రోజున జరిగిన ఒక కార్యక్రమములో తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలి గారి చేతుల మీదుగా పురస్కారాన్ని ఇప్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, సాహితీ వేత్తలు హాజరైనారు. ఇదివరలో గోపాల్ గారు సింగపూర్, మలేషియాలలో ఉగాది ఉత్సవాలలో వ్యాఖ్యానంచేశారు. వేములవాడలో జరిగే త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో, శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలలో వ్యాఖ్యాతగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం స్వాతంత్రియ మరియు ఘనతంత్ర దినోత్సవ వేడుకలలో మరియు పలు కార్యక్రమాలలో వీరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎన్నో సన్మానాలు, బిరుదులు పొందారు. వీరు రచయితగా సంపాదకులుగా కూడా పనిచేస్తూ చెలిమి చెలిమేలు అను పుస్తకాలు వ్రాసారు. జగిత్యాలలో అలిశెట్టి పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వ్యాఖ్యానంలో రాష్ట్ర స్థాయి సినారే వాగ్భూషణ పురస్కారాన్ని అందుకున్నారు. వీరు మా తెలంగాణ రాష్ట్ర అవోపాలో ప్రభుత్వ మరియు అవోపాల సంధాన కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. పురస్కార గ్రహీత శ్రీ మాడిశెట్టి గోపాల్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి