అపర చాణక్యుడు రాజనీతిజ్ఞుడు, వాసవీ మాత ముద్దుబిడ్డ, అహర్నిశలు ప్రజల అవసరాల మెరుగుదలకు పాటుపడే అవిశ్రాంత సంఘజీవి, వైశ్య జాతికే మకుటం లాంటి మహానుభావుడు శ్రీ అమిత్ అనిల్ చంద్ర షా. నేడు ఆర్టికల్ 370 మరియు 35ఏ రద్దు అను సాహసోపేత నిర్ణయంతో జమ్ము కాశ్మీర్ లడక్ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలచి పోనున్నాడు. ఒక వైశ్యుడు మహాత్మా గాంధీ రూపంలో దేశాన్ని బానిసత్వ శృంఖలాలనుండి విముక్తి కలిగిస్తే మరో వైశ్యాంకురం కాశ్మీరీ వాసులకు స్వేచ్ఛను ప్రసాదించి ఒకే దేశం ఒకే జెండా ఒకే శాసనం అనువిధంగా దేశ గతిని మార్చేయనున్న శ్రీ అమిత్ షా వైశ్యుడు కావడం మన వైశ్య జాతికే గర్వకారణం. వారి సాహసోపేత నిర్ణయానికి వారి సేవా తత్పరతకు తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందనలు తెలుపుచున్నవి.
అభినందనలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి