తేదీ 30 జూన్ న వెంకటేశ్వర గార్డెన్స్ వరంగల్ లో ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాష్ గారిని సన్మానించడం జరిగినది. సం ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు హస్త కళల చైర్మన్ బొల్లం సంపత్ గారు మహాసభ ప్రెసిడెంట్ అమరావతి లక్ష్మీనారాయణ గారు తదితర ప్రముఖులు హాజరైన ఈ మహా సభకు శ్రీ పోకల చందర్ గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముగ్గులై మేయర్ గారు సభ నిర్వాహకులు వారిని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాదారపు రాజేశ్వర్ గారు అడ్వకేట్ అల్లాడి వీరభద్ర య్యగారు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంత మొనర్చినారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి