అవోపా హైదరాబాద్ వారు నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమం

*అవోపాహైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవ కార్యక్రమం*

ఈరోజు సంజీవయ పార్క్ లో ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు మల్పెద్ది శంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి గారు ప్రసంగిస్తూ మనము మన కుటుంబాలలో సనాతన సంప్రదాయాలను పాటించడం లేదు వాటిని పిల్లలకు అలవడేటట్లు చేస్తె సంస్కారవంతులు గా పిల్లలు  ఎదుగుతారు ఇలా జరగాలంటే తల్లిదండ్రులు ప్రదాన పాత్ర వహించాలని తన ప్రసంగంలో తెలిపారు .తర్వాత అవోపా హైదరాబాద్ వారు చాల మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.మరో అతిథి ఉప్పల రాజ్యలక్ష్మి గారు కోశాధికారి తెలంగాణ రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా వారు కూడా హాజరయ్యారు.వారు ప్రసంగిస్తూ కార్తీక మాసము యొక్క ప్రాముఖ్యత ‌గురించి మరియు అర్య వైశ్యుల గొప్పతనం గురించి వివరించారు.  ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పిల్లలకు fun గేమ్స్, లెమన్ అండ్ స్పూన్ ,మ్యూజికల్ చైర్,మేడ్ ఫర్ ఈచ్ అదర్, తంబోలా మరియు ఈ వన మహోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి సభ్యుని యొక్క కూపన్ వేసి లక్కీ డ్రా గా తీసిన ముగ్గురు విజేతలకు అధ్యక్షుల వారి ద్వారా బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 200 కుటుంబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేణికుంట్ల నమశ్శివాయ, కార్యదర్శి మడుపల్లి రవి గుప్తా, కోశాధికారి మాకం బద్రీనాథ్, అవోపా హైదరాబాద్ పూర్వపు అధ్యక్షులు బిజినేపల్లి చక్రపాణి, ప్రాజెక్టు చైర్మన్ పల్లెర్ల రమేష్ సలహాదారు డాక్టర్ కవిరత్న చింతల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులుబైసాని సత్యనారాయణ ,సమీ సంపత్, కే. రాజేశ్వరరావు డాక్టర్ లక్ష్మయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అవోపా హైదరాబాద్ వారిని అభినందిస్తున్నవి.

కామెంట్‌లు