నూతన కమిటీ కి అభినందనలు

 

లక్షేట్టిపేట AVOPA అధ్యక్షులు గా సుదర్శన్ ప్రధాన కార్యదర్శి గా కిరణ్ ఆర్థిక కార్యదర్శి గా సత్తయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికైన శుభ సందర్బంగా అభినందనలు  శుభాకాంక్షలు తెలియజేయుచున్న  మలిపెద్ది శంకర్ రాష్ట్ర అధ్యక్షులు వారి కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్. ఈ సందర్భంగా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి/ ఎన్నికల అధికారి సిరిపురం శ్రీనివాస్  మాట్లాడుచూ అవోపా సభ్యులు అందరు ఐకమత్యంగా ఉండాలని పేర్కొన్నారు. సమాజ సేవలో అవోపా సభ్యులు ముందుంటారని రాష్ట్రంలోనే మంచిరియాల జిల్లా అవోపా కమిటీ ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించిందని మంచిరియాల జిల్లా కమిటీని అభినందించారు.  అన్ని ప్రాంతాలలో అవోపా యూనిట్లను ఎన్నుకోవాలని  నూతన జిల్లా కమిటీ కి సూచించారు.  ప్రతి అవోపా ఆర్యవైశ్య సభ్యుడు సమాజ సేవలో ముందుండాలని మున్సిపల్ చైర్మన్ నాలమాసు కాంతయ్య పేర్కొన్నారు.  ప్రతి నాయకుడు నిరుపేదలకు సహాయం అందించేందుకు ముందుడాలని కోరారు. ఈ సందర్బంగా జిల్లా అవోపా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ అవోపా కమిటీలకు చెన్నూర్, మంచిరియాల, లక్సట్టిపేట, జన్నారం, బెల్లంపల్లి కమిటీలకు మెరిట్ సర్టిఫికెట్ల ను అందించి సన్మానించారు. అనంతరం  మంచిరియాల  జిల్లా అవోపా  అధ్యక్షుడిగా  గుండ సత్యనారాయణ, ... .. ప్రధానకార్యదర్శిగా సత్యనారాయణ, కోశాధికారి రవీందర్ లను ఎన్నుకున్నారు. మండల అవోపా అధ్యక్షుడిగా పాలకుర్తి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కొత్త కిరణ్,  కోశాధికారి బొద్దుకూరి సత్తయ్య లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర, జిల్లా, మండల అవోపా నాయకులు ,  కొత్త వెంకటేశ్వర్లు, బల్లు ప్రకాష్, గుండప్రభాకర్, పబ్బా శ్రీనివాస్, జనార్దన్, పల్లెర్ల శ్రీహరి, గంప రవీందర్, సత్యవర్ధన్, ఆర్యవైశ్య సంఘం నాయకులు చెట్ల రమేష్, కటకం రమేష్, మైలారపు సుధాకర్,  జిల్లా అవోపా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌లు