కుటీర్లో కార్తీక మాస వేడుకలు

అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ మరియు కుటీర్ వృద్ధాశ్రమం వారు సంయుక్తంగా  సత్యనారాయణ స్వామి వ్రతం కుటీర్ మల్లాపూర్ బాలాపూర్ మండలం హైదరాబాద్ నందు కార్తిక పూర్ణిమ సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఇట్టి వ్రతమునకు ట్రస్టీలు శ్రీమతి మరియు శ్రీ పివి రమణయ్య గారు శ్రీమతి మరియు శ్రీ కేవీయస్ గుప్తా గారు 
శ్రీమతి మరియు శ్రీ బైసాని సత్యనారాయణ గారు శ్రీమతి మరియు శ్రీ బుధా జయరామ కృష్ణ గారు శ్రీమతి మరియు శ్రీ బి యస్ యస్  కృష్ణ గారు  మరియు శ్రీ సంపత్ కుమార్ గారు మరియు, శ్రీ గర్రే మురళీ కృష్ణ గారు వీరందరూ రమాసహిత వీర వేంకట  సత్యనారాయణ స్వామి వారి వ్రతము బహునిష్ఠ తో చేశారు. ముఖ్య అతిథిగా శ్రీ ఆర్ యస్ వి బదరీనాథ్ గారు విచ్చేసినారు. తదనంతరం  కుటీర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు బి టి కాంతారావు గారి విగ్రహంను ఆవిష్కరించారు. యస్ వి యస్ మూర్తి గారు ఆర్ మోహన్ దాస్ గారు కే సూర్య నారాయణ మూర్తి గార్ల చిత్రపటాలను కూడా ఆవిష్కరించారు. అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ వారు  బీదలకు వంటసామగ్రిని మరియు Rs 20000/ స్కాలర్షిప్పులు అందజేసినారు. ఈ కార్యక్రమంలో వందమందికి పైగా హాజరైనారు. శ్రీ పివి రమణయ్య గారు అద్యక్షులు అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ మరియు అద్యక్షులు కుటీర్ వృద్ధాశ్రమం మల్లాపూర్ , బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను కుటీర్ వృద్ధాశ్రమంను గూర్చి వివరించారు. శ్రీ రామానందం గారు సభికులందరికి శ్రీ బి టి కాంతారావు గారిని గురించి చెప్పారు. శ్రీ గర్రే మురళీ కృష్ణ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

కామెంట్‌లు