అవోపా ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు


            పిల్లల దినోత్సవం సందర్భంగా    జ్ఞానేశ్వర వాత్సల్య  మందిరంలో    అవోపా ఆధ్వర్యంలో   నిర్వహించిన  కార్యక్రమములో   అమ్మాయిలకు   నోట్ బుక్స్  అందజేయడం    జరిగింది. ఈ సందర్భంగా   అవోపా అధ్యక్షులు  వాసా రాఘవేందర్  మాట్లాడుతూ  నేటి బాలలే  రేపటి పౌరులని  బాల్యాన్ని  ఆటపాటల తో   ఆనందంగా  గడిపితే  జీవితంలో కూడా విజయం సాధించి  ఉన్నత శిఖరాలకు  చేరుకుంటారని  తెలిపారు. నోట్ బుక్స్ దాత   లాగి శెట్టి  రాణి  శ్రీనివాసులు దంపతులు  తమ కూతురు హాసిని  పుట్టినరోజు సందర్భంగా   నోట్ బుక్స్  పంపిణీ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  అవోపా ప్రతినిధి  ఏ  వీరేశ్ మరియు ఆశ్రమ నిర్వాహకులు  విద్యార్థులు, పాల్గొన్నారు.  దాత అయిన  రాణి  శ్రీనివాసులు  దంపతులకు  ఆశ్రమ నిర్వాహకులు  విద్యార్థులు  ధన్యవాదాలు  తెలిపారు. చిల్డ్రన్స్ డే సందర్బంగా నాగర్ కర్నూల్ AVOPA అధ్యక్షులు వాస రాఘవేందర్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి ఎంతో అభినందనీయమని రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ అభినందనలు తెలిపారు.

కామెంట్‌లు