అభినందనలు



 శ్రీ కందికొండ శ్రీనివాస్ అచ్ఛంపెట ఉన్నత పాఠశాలలో ఉపధ్యాయునిగా పనిచేస్తూ 2010 -2013 వరకు యూనిట్ అవోపా అచ్చంపేట అధ్యక్షులుగా,  2014 - 2018 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవోపా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 2019 నుండి నాగర్ కర్నూలు జిల్లా అవోపా ప్రధాన కార్యదర్శిగా పని చేయు చున్నారు. వీరి పదవీ కాలంలో అనాథ వృద్ధులకు చేయూతనివ్వడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సులు,  కెరీర్ గైడెన్స్ గురించి అవగాహన తరగతులు, ఉచిత పాలిటెక్నిక్ బోధన తరగతులు మరియు ప్రతిభ, సేవ పురస్కారాలు  నిర్వహించి అచ్చంపేట అవోపాను ప్రథమస్థానంలో నిలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గా 11 వివాహ పరిచయ వేదిక, మహాత్మా గాంధీ కాస్ట్యూమ్ షో, కవి సమ్మేళనం లాంటి సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించారు. వీరు  అవోపా వ్యవస్థాపకులు కృష్ణయ్య శెట్టి ఫెలోషిప్ అవార్డు గ్రహీతలు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా, వందేమాతరం ఫౌండేషన్ జిల్లాస్థాయి విశిష్ట ఉపాధ్యాయ పురస్కారం , లైన్స్ క్లబ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా, శారద విద్యా పీట్ రాష్ట్రస్థాయి ఉత్తమ గణిత కీర్తి అవార్డు, మరియు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. వీరు అవోపా కార్యక్రమాలలో  చురుకుగా పాల్గొంటున్నందుకు మలిపెద్ది శంకర్ గారు రాష్ట్ర అవోపాలో కార్య నిర్వాహక కార్యదర్శిగా సముచిత స్థానాన్ని కల్పించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు  అవోపా న్యూస్ బులెటిన్ వీరికి అభినందనలు తెలుపుతున్నవి. 
 

కామెంట్‌లు